నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టార్ యాక్టర్ పై దాడి చేయడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
#VijaySethupathi#AttackonVijaysethupathi https://t.co/Dfe8wMVTm5
— franklin kumar (@frankklinkumar) November 3, 2021