Pushpa Songs : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా ఇక ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ మరో పాటను విడుదల చేసింది మూవీ యూనిట్.
1000 మందికి పైగా డ్యాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ సాంగ్ థియేటర్లలో దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.