అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రేమమ్ మూవీ తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. వరుసగా మజిలీ , లవ్ స్టోరీ సినిమాలతో విజయాలను అందుకున్నాడు నాగ చైతన్య. ఇక మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ మూవీలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మనం’ మూవీ తరువాత విక్రమ్- చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక నేడు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు మూవీ యూనిట్. పోస్టర్ లో నాగ చైతన్య లుక్ ఆకట్టుకొంటుంది. అల్ట్రా స్టైలిష్ డ్రెస్ లో కూల్ గ్లాసెస్ తో క్లాస్ గా కనిపించాడు. రంగుల రాట్నంలోని గుర్రం బొమ్మపై కూర్చొని చిన్నపిల్లాడిలా నవ్వులు చిందిస్తున్న నాగ చైతన్య పోస్టర్ వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నాగ చైతన్య సరసన రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.