Pushpa Movie Trailer Tease : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. దాక్కొ.. దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా..
ఇక ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు మూవీ యూనిట్. డిసెంబర్ 6వ తేదీన మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇక తాజాగా ‘పుష్ప’ ట్రైలర్ టీజ్ అనే పేరుతో మూవీలోని మెయిన్ కట్స్ ని వీడియోగా వదిలారు. ఈ టీజ్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తోంది. మూవీలోని ప్రధాన పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. పుష్ప రాజ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. బన్నీ, రష్మిక, అనసూయ, సునీల్, అజయ్ పాత్రలను చూపించారు.. ఇక ఫస్ట్ పార్ట్ లో సునీల్ విలన్ అని, సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాజిల్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న వేళ ఈ ట్రైలర్ టీజ్ లో ఫహద్ ఫాజిల్ ని కూడా చూపించడం విశేషంగా మారింది. బ్యాక్ షాట్ లో ఫహద్ ఫాజిల్ కనిపించి కనువిందు చేశాడు.