Radhe Shyam Movie Postponed : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ విడుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు నిర్మాతలు తెరదించారు. జనవరి 14న మూవీని విడుదల చేయబోమని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు మరియు తమ అభిమాన హీరో మూవీ సంక్రాంతి రేసులో లేదని తెలియడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్విటర్లో ‘ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా ‘రాధే శ్యామ్’ మూవీ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. మీ బేషరతు ప్రేమ, మద్దతు కోసం అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో థియేటర్లలో కలుద్దాం..!’ అంటూ ఓ అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యూవీకి థమన్ నేపథ్య సంగీతం అందించారు.