Unstoppable With NBK This Sankranthi : ఆహా ఓటీటీ వేదికగా నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ప్రజాదరణ పొందుతోంది. బాలయ్య తన చమత్కారాలు, ఛలోక్తులు, కొంటె ప్రశ్నలతో ఎపిసోడ్ ను మించి మరో ఎపిసోడ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.
తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ టీమ్ ‘అన్ స్టాపబుల్ షో'(Unstoppable With NBK)లో పాల్గొంది. దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ మరియు హీరో విజయ్ దేవరకొండ ఈ షోకి విచ్చేశారు. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో త్వరలోనే విడుదల కానుంది.
Festivities on #UnstoppableWithNBK this Sankranthi. #NandamuriBalakrishna is coming to you along with @TheDeverakonda and team liger.
— ahavideoIN (@ahavideoIN) January 9, 2022
Promo soon.
Episode premieres on January 14.@purijagan @Charmmeofficial pic.twitter.com/r6unaBDnqv