Bright Telangana
Image default

Unstoppable With NBK : అదరగొట్టేలా ‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమో

Unstoppable Episode 1 Promo Balakrishna Mohan Babu

బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలకృష్ణ చేస్తోన్న టాక్ షో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి గెస్ట్ గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హారాజారయ్యారు. తనదైన మాటలతో మోహన్ బాబును తికమక పెట్టారు బాలకృష్ణ.

నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అంటూ అదిరిపోయే డైలాగ్ తో ప్రోమో మొదలైంది. ఆతర్వాత మోహన్ బాబును ఆహ్వానించారు బాలకృష్ణ. ఈ ఇద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ఇంకా కుర్రాడిలా ఉన్నారేంటి అంటూ బాలకృష్ణ మోహన్ బాబును అడగ్గా.. ఎవరికీ వయసు నీ వయసెంత అని తిరిగి మోహన్ బాబు అడిగారు.. దానికి బాలకృష్ణ 16 ఏళ్ళు అంటూ నవ్వులు పూయించారు. మీరు నటించిన సినిమాల్లో మీరు చేసుకోలేని సినిమా ఏంటి అని బాలకృష్ణ అగడ్డగా ‘పటాలం పాండు’ అనే సినిమా అన్నారు. దానికి బాలకృష్ణ అంత రాడ్డు రంబోలా నా.. అంటూ నవ్వేశారు బాలకృష్ణ. ఆ తర్వాత మోహన్ బాబు సినీ కెరీర్ గురించి ప్రశ్నించగా ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు. చివరిలో మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న షోలో హాజరయ్యారు. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Ginna Teaser : హారర్ టచ్ ఇచ్చిన మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ టీజర్!

Hardworkneverfail

Unstoppable with NBK : చిరంజీవితో గొడవలు ఉన్నాయా..? క్లారిటి ఇచ్చిన బాలయ్య..

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail

Akhanda Movie Collections :‘అఖండ’ మూవీ 20 డేస్ కలెక్షన్స్..

Hardworkneverfail

Lakshya OTT Trailer : ‘లక్ష్య’ మూవీ ఓటిటి ట్రైలర్‌ రిలీజ్..

Hardworkneverfail

Akhanda Collections :‘అఖండ’ మూవీ 11 డేస్ కలెక్షన్స్.. బాలయ్య మాస్ పవర్!

Hardworkneverfail