Nagarjuna on Chiru, CM Jagan Meet : మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమైన విషయం తెలిసిందే. వారి భేటీపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఏపీ సీఎం నాగార్జున చెప్పారు జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం అని నాగార్జున చెప్పారు. చిరంజీవి తన ఒక్కరికోసమే వెళ్లలేదని, తమ అందరి కోసమే ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారని మరియు త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి అని అక్కినేని నాగార్జున చెప్పారు.
తాను నటించిన ‘బంగార్రాజు’ మూవీ ఫంక్షన్ ఉండటం వల్ల జగన్ వద్దకు తాను వెళ్లలేదని అక్కినేని నాగార్జున తెలిపారు. ఏపీ సీఎం జగన్తో మీటింగ్ ఉందని తనకు చిరంజీవి వారం రోజుల క్రితమే చెప్పారని నాగార్జున అన్నారు.