Chiranjeevi God Father Movie Digital Rights : మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా మూవీ ఓటీటీ రైట్స్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నదని టాక్ నడుస్తోంది. అన్నీ ఓటిటీలో తో పోటీ పడి నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 57 కోట్లు పెట్టి ఈ మూవీని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే.. ఆచార్య నిరాశ పర్చడంతో మెగా అభిమానులందరి చూపు ఈ మూవీపైనే ఉంది. చాలా రోజుల తరువాత చిరంజీవి రాజకీయాల నేపథ్యంలో మూవీ చేయడం, నయనతార చిరంజీవికి చెల్లెలిగా చేయడం.. మొట్ట మొదటిసారి చిరంజీవి మూవీలో సల్మాన్ గెస్ట్ గా చేయడం.. ఇవన్నీ ఈ మూవీపై అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ మార్కెట్ కూడా మంచిగా ఉండడంతో ఈసారి చిరంజీవి పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఈ మూవీతో చిరంజీవి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.