Bright Telangana
Image default

Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser : ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. బట్ వన్ కండీషన్

Aa Ammayi Gurinchi Meeku Cheppali

Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser : సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ మరియు గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీని.

తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) టీజర్ రిలీజై విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ చూసినట్టైతే..మూవీలో సుధీర్ బాబు దర్శకుడి పాత్రలో కృతి శెట్టి డాక్టర్ అలేఖ్య పాత్రలో నటిస్తున్నారు. సుధీర్ బాబు ‘రోల్ సౌండ్.. రోల్ కెమెరా.. యాక్షన్’ అని చెప్పే డైలాగ్‌తో మూవీ టీజ‌ర్‌ మొదలైంది.

6 సంవత్సరాల్లో 6 హిట్ మూవీస్ తీసిన దర్శకుడిగా హీరో సుధీర్ బాబుని పరిచయం చేశారు. అదే దర్శకుడు ‘ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ జరిగే కథ తీద్దామని అనుకుంటున్నాను’ అని డైలాగ్ చెప్పడంతోనే హీరోయిన్ కృతి శెట్టిని పరిచయం చేశారు. డాక్టర్ అయిన కృతి శెట్టికి అసలు మూవీస్ అంటేనే పడదు. అలాంటి అమ్మాయిని హీరోయిన్‌గా తన కథలో చేయడానికి ఎలా ఒప్పించాడనేదే మూవీ కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ చివరిలో ‘మీ మూవీలో నేను యాక్ట్ చేస్తాను ..బట్ వన్ కండీషన్’ అంటూ హీరోయిన్ కృతి శెట్టి చెప్పిన డైలాగ్ ఆసక్తిని కలిస్తోంది. మొత్తంగా టీజర్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌ను వివేక్ సాగర్ స్వరపరిచారు. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్.

Related posts

Bangarraju Trailer : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ ట్రైలర్

Hardworkneverfail

Krithi Shetty : బంగార్రాజు మూవీ నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..

Hardworkneverfail

Bangarraju Movie Update : ఈ నెల 14వ తేదీన వచ్చేస్తున్నా ‘బంగార్రాజు’

Hardworkneverfail

Sridevi Soda Center: ఓటీటీలోకి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’..ఎప్పుడంటే?

Hardworkneverfail