Akhanda Movie 52 Days Total Collections : నట సింహం నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయి ఇప్పుడు 50 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇప్పటికీ కూడా థియేటర్స్ ని సాలిడ్ గానే హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.
50 రోజుల తర్వాత కూడా అఖండ మూవీ బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ఆగడం లేదంటే మూవీ జోరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ‘అఖండ’ మూవీ తెలుగు రాష్ట్రాలలో 51వ రోజున 4.20 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 52వ రోజు మరోసారి వీకెండ్ అడ్వాంటేజ్ తో గ్రోత్ ని చూపెట్టి 5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, దాంతో టోటల్ 52 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
నైజాం | 21.10 cr |
ఉత్తరాంధ్ర | 6.35 cr |
సీడెడ్ | 15.94 cr |
ఈస్ట్ | 4.22 cr |
వెస్ట్ | 4.29 cr |
గుంటూరు | 4.83 cr |
నెల్లూరు | 2.64 cr |
కృష్ణా | 3.67 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 63.04 cr (104.70CR Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 10.91 cr |
ఓవర్ ఫ్లో | 0.85 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 74.80 cr (132.30CR Gross) |
54 కోట్ల టార్గెట్ మీద అఖండ మూవీ 20.80 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.Akhanda Movie 52 Days