ఆంధ్రప్రదేశ్: తిరుపతి సమీపంలోని రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. 15వ శతాబ్దం నాటి చెరువు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. లీకేజీలు కూడా కనిపించాయి. ఓ చోట గండిని అధికార యంత్రాంగం పూడ్చివేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి.
నిన్నటి నుంచి దాదాపు 20వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శివారులో మూడు సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసారు అధికారులు.న్నాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం గండి పూడ్చివేత పనుల్లో నిమగ్నమైన్నారు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు. గత రాత్రి చెరువు దగ్గరే ,అధికారులు ,స్దానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిద్రించారు. గ్రామాలను వదలకుండా కొండలపై, ఇళ్ల మిద్దెలపై తలదాచుకుంటున్నారు కొందరు గ్రామస్తులు. చెరువు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ చెరువు దాదాపు 17వందల ఎకరాలలో ఉంటుంది అని చెబుతున్నారు.