బిగ్బాస్ సీజన్ 5 నాలుగో వారం ముగిసింది. ఇక అంతా అనుకున్నట్టుగానే.. ఈసారి నటరాజ్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు మొదలుకానుంది. వారమంతా ఎలా గడిచిన నామినేషన్స్ రోజు కంటెస్టెంట్స్ అందరీకి అతి పెద్ద గండమనే చెప్పుకోవాలి. ఈరోజున వారంలో జరిగిన విషయాలను.. ఒకరిపై ఒకరికి ఉన్న ఆరోపణలను తీర్చుకుంటుంటారు. ఇక ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్.