ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిందో లేదో అలా కెప్టెన్సీ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ‘బంగారు కోడిపెట్ట’ పేరుతో ఓ వినూత్న టాస్క్ ఇచ్చాడు. హౌజ్ లివింగ్ ప్లేస్‌లో కోడి ఆకారంలో ఉన్న బొమ్మ నుంచి గుడ్లను తీసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ గుడ్లు ఉంటాయో వారు కెప్టెన్సీ టాస్క్ గెలిచినట్లు. మరి కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ కొత్త ప్రోమోను విడుదల చేశారు.
ప్రోమోను గమనిస్తే.. నిన్నటి ఎలిమినేషన్ తాలూకు హీట్ ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. నామినేషన్‌లో భాగంగా జరిగిన పరిమాణాలపై హౌజ్‌మేట్స్ మధ్య తీవ్ర చర్చకు దారి తీశాయి. వాళ్లు ఆడితే గేమ్.. నేను ఆడితే క్రైమా.? అని సన్నీ కాస్త సీరియస్‌గా స్పందించాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్‌పై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోని చూసి ఎంజాయ్ చేయండి.