బిగ్‌బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సగం మంది ముఖాలు జనాలకు అంతగా తెలియనే తెలియవు.. అందులో మోడల్ జస్వంత్ ఒకరు. బిగ్‌బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చేవరకు జస్వంత్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంతో యాక్టివ్‍గా గేమ్ ఆడుతున్న జెస్సీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. కాలికి తగిలిన దెబ్బను సైతం లెక్కచేయకుండా ఫిజికల్ టాస్కులలో తనవంతూ పర్ఫామెన్స్ ఇచ్చాడు జెస్సీ.
ఇక కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా ఇంటి నుంచి జెస్సీ అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చేస్తాడంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో జెస్సీని నిజాంగానే బయటకు వచ్చేసిన సంగతి రివీల్ చేశారు బిగ్‌బాస్. జెస్సీ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండడం వలన.. అతనికి సరైన చికిత్స అవసరమని.. అందుకే తనను ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నట్లుగా చెప్పాడు బిగ్‌బాస్. అయితే జెస్సీ చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి ఇంట్లోకి రీఎంట్రీ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి.