Bright Telangana
Image default

కేసీఆర్ సంచలన ప్రకటన : దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్, దళితబంధు, రైతుబంధు..

free-power-dalit-bandhu-rythu-bandhu-all-over-india-if-brs-comes-in-to-power

BRS : తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత్ విద్యుత్, దళితబంధు, రైతుబంధు అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా వెలుగు జిలుగులు తీసుకొస్తామన్నారు. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మితే.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మళ్లీ జాతీయం చేస్తామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు కేసీఆర్. ఏపీకి చెందిన పలువురు నేతలు సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సంద్భంగా మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బలపరిచి గెలిపించుకోండి. భారత్ దేశవ్యాప్తంగా ఏడాదంతా దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళితబంధు అమలు చేస్తాం. ఏడాదికి 25లక్షల కుటుంబాలకు ఇస్తాం. అందుకోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. బీజేపీది ప్రైవేటైజేషన్. మాది నేషనలైజేషన్.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒకవేళ మోదీ ప్రభుత్వం అమ్మినా.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తిరిగి వాపస్ తీసుకుంటాం. అవసరమైనే రూ.10, 20వేల కోట్లు నష్టపోయినా సరే తిరిగి తీసుకుని స్టీల్ ప్లాంట్ ను పబ్లిక్ సెక్టార్ లో పెడతాం. మేకిన్ ఇండియా ఎక్కడ? అచ్చమైన అసలుసిసలైన ప్రజా రాజకీయాలు ఏపీలో ప్రారంభం కావాలి. నీటి యుద్ధాలు ఎందుకు? నీటి కోసం పేచీలు దేనికి? దేశాన్ని పాలించే వాళ్లు మనతో ఆడుకుంటున్నారు.

నీటి కోసం, విద్యుత్ కోసం గొడవలు జరగడానికి కారణం సరైన పాలసీలు లేకపోవడమే. తాగు నీళ్ల కోసం ప్రజలు ఎందుకు అవస్థలు, బాధలు పడాలి? ఇంకా ఈ నీటి యుద్ధాలు ఎందుకు? సమాజం కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ దేశం కోసం. కచ్చితంగా లక్ష కిలోమీటర్ల ప్రయాణం అయినా తొలి అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మనకు లక్ష్య, చిత్త, సంకల్ప శుద్ది ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు” అని కేసీఆర్ తేల్చి చెప్పారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏపీకి కూడా విస్తరించాలన్న సీఎం కేసీఆర్ ప్రణాళికలో భాగంగా సోమవారం తొలి అడుగుపడింది. ఏపీకి చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.

Related posts

Ayyappa Devotees Protest : రాజేశ్‎ను తమకు అప్పగించాలని అయ్యప్ప స్వాముల ఆందోళన

Hardworkneverfail

వనపర్తిలో బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం..

Hardworkneverfail

తెలంగాణలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలితో గజగజ వణుకుతున్న జనం

Hardworkneverfail

CM KCR: “మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం..” బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. కిషన్ రెడ్డికి వార్నింగ్

Hardworkneverfail

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail

Rythu Bandhu : తొలిరోజు 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.587 కోట్లు..

Hardworkneverfail