Bright Telangana
Image default

Historic Win for India against SA : సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Historic Win for India against SA

Historic Win for India against SA in Centurion : గురువారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇండియా 113 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

వర్షం కారణంగా టెస్టు రెండో రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, ఇండియా విజయం సాధించింది. సెంచూరియన్‌లో విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా తొలిసారి విజయం సాధించింది. 305 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది.

ఓవర్‌నైట్ స్కోరు 94/4తో 5 రోజైన నేడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా.. ఇండియా బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ముఖ్యంగా బుమ్రా, షమీ దెబ్బకు పెవిలియన్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ 77 పరుగులు చేయగా, తెంబా బవుమా 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా ఎదుట 305 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో తబడిన సౌతాఫ్రికా.. టీమిండియా బౌలింగును ఎదుర్కోలేక చేతులెత్తేశారు

Related posts

Asia Cup 2022 : ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా విజయం..

Hardworkneverfail

హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువైన వాచ్ లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

Hardworkneverfail

T20 World Cup : టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hardworkneverfail

T20 World Cup 2021: నమీబియా పై టీమిండియా విజయం..హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమణ

Hardworkneverfail

IND Vs SA 1st T20: కేఎల్ రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా ఘనవిజయం

Hardworkneverfail

T20 World Cup: అఫ్ఘానిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం.. సెమీస్ నుంచి ఇండియా ఔట్!

Hardworkneverfail