Bright Telangana
Image default

KGF 2 Movie Review : కేజీఎఫ్: చాప్టర్-2 మూవీ రివ్యూ..

KGF 2 Movie Review

KGF 2 Movie Review : 2018 లో వచ్చిన కన్నడ అనువాద మూవీ కేజీఎఫ్: చాప్టర్-1 సంచలన విజయం తర్వాత పార్ట్ 2 పై అంచనాలు పెరిగి పోగా మూవీ రిలీజ్ వేవ్ ల వలన ఆలస్యం అయినా కానీ ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్ వలనే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన కేజిఎఫ్: చాప్టర్-2 మూవీ భారీగా అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరి చాప్టర్-2 ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ.

ముందుగా స్టొరీ విషయానికి వస్తే కేజిఎఫ్ ని సొంతం చేసుకున్న హీరో కి అధీర నుండి అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుండి పెద్ద సవాళ్లు ఎదురు అవుతాయి. వాటిని తట్టుకుని హీరో ఏం చేశాడు అన్నది కేజిఎఫ్: చాప్టర్-2 స్టొరీ లైన్. కథ పరంగా ఈ చాప్టర్-2 లో కూడా ఏమి స్టొరీ లేదు.. కేజిఎఫ్: చాప్టర్-1 కూడా కథ పరంగా ఏమి ఉండదు, కేవలం ఎలివేషన్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో ఆ మూవీ ఊహకందని విజయాన్ని సొంతం అయ్యేలా చేసింది. ఇక్కడ కూడా ఎమోషన్స్ మరీ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయితే అవ్వలేదు కానీ ఎలివేషన్స్ పరంగా మాత్రం కేజిఎఫ్: చాప్టర్-1 కి ఏమాత్రం తీసిపోదు కేజిఎఫ్: చాప్టర్-2 మూవీ. హీరో ఇంట్రడక్షన్ కానీ.. తూఫాన్ సాంగ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ కానీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఒక్కటి చాలు టికెట్ డబ్బులు గిట్టుబాటు అవ్వడానికి అని చెప్పే రేంజ్ లో దుమ్ము లేపాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చాప్టర్-2 లో యష్ తన రోల్ వరకు కుమ్మేశాడు.

చాప్టర్-2 లో ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఇక శ్రీనిధి శెట్టి రోల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి సెకెండ్ ఆఫ్ లో కథ టర్న్ అయ్యేలా చేయగా, రవీనా టండన్ రోల్ కూడా చాప్టర్-2 ఆకట్టుకుంటుంది. ఇక సంజయ్ దత్ విలనిజం చాప్టర్-2 లో మరీ హైప్ ఇచ్చినంత లేదనే చెప్పాలి. జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించారు. ఇక మూవీకి మేజర్ హైలెట్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి.

కేజిఎఫ్: చాప్టర్-2 లో సాంగ్స్ ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం లౌడ్ గా ఉన్నప్పటికీ ప్రతీ సీన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది అని చెప్పాలి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కొంచం స్లో అవ్వగా సెకెండ్ ఆఫ్ లో కూడా కొంచం స్లో డౌన్ అవుతుంది, సినిమాటోగ్రఫీ అదిరిపోగా కొన్ని షాట్స్ హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా మెప్పించాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ విషయానికి వస్తే కేజిఎఫ్: చాప్టర్-2 అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆశలు పెంచుకునేది ఎలివేషన్ సీన్స్ మీదే. ఆ విషయంలో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కానీ కథ పరంగా ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఎమోషనల్ టచ్ సెకెండ్ ఆఫ్ లో లేదనిపించగా, స్క్రీన్ ప్లే కూడా కొంచం కన్ఫ్యూజ్ అయ్యేలా చేయడం మరో మైనస్ పాయింట్. కథ కూడా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం కూడా ఒక మైనస్ కాగా మొత్తం మీద ఎలివేషన్ల విషయంలో దుమ్ము లేపినా మిగిలిన విషయాల్లో కొంచం నిరాశ పరిచాడు.

మొత్తం మీద హైలెట్స్ విషయానికి వస్తే ఎలివేషన్ సీన్స్ అన్ని దుమ్ము లేపాయి, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ డ్రాగ్ అవ్వడం, విలన్ (సంజయ్ దత్) అనుకున్న రేంజ్ పవర్ ఫుల్ గా లేక పోవడం లాంటివి అని చెప్పొచ్చు. అయినా కానీ ఆడియన్స్ మూవీ నుండి ఏమైతే కోరుకుంటారో. అవి చాలా వరకు మూవీ లో ఉండటం తో కేజిఎఫ్: చాప్టర్-1 మాదిరిగానే మాస్ ఆడియన్స్ కి ఎలివేషన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి కేజిఎఫ్: చాప్టర్-1 నచ్చిన వాళ్ళందరికీ కూడా కేజిఎఫ్: చాప్టర్-2 కూడా నచ్చుతుంది.

మొత్తం మీద కేజిఎఫ్: చాప్టర్-2 ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం అయితే ఖాయం. ఓవరాల్ గా మూవీ కి మేం ఇస్తున్న రేటింగ్ 3.25

Related posts

KGF 2 Movie Collections : KGF 34 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail

KGF 2 Movie Collections : KGF 2 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

KGF 2 Movie : ‘కేజీఎఫ్-2’ మూవీ నుండి క్రేజీ అప్డేట్.. డేంజరస్ గా రాఖీభాయ్

Hardworkneverfail

KGF 2 Movie 1st Day Collections : KGF 2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

KGF 2 Industry Record : ఇండస్ట్రీ రికార్డ్ తో బాలీవుడ్ మైండ్ బ్లాంక్..

Hardworkneverfail