Bright Telangana
Image default

Khiladi Movie : రవితేజ ‘ఖిలాడీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ మరియు కలెక్షన్స్ డీటైల్స్..!

Khiladi Movie 8 Days Collection

Khiladi Movie Total Business : మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయినా కానీ అనుకున్నంతగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో జరగలేదు. క్రాక్ మూవీతో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న రవితేజ ఈ మూవీతో మరో హిట్ ని అందుకుంటే మాస్ మహారాజ్ రవితేజ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

ఇక క్రాక్ మూవీ తో పోల్చితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఖిలాడి మూవీ బిజినెస్ కూడా ఎక్స్ లెంట్ గా జరిగింది.. ఆంధ్రలో పరిస్థితుల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా రవితేజ మూవీని కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడ్డారు. దాంతో ఓవరాల్ గా మంచి బిజినెస్ ఈ మూవీకి సొంతం అయ్యింది. ఇక హిందీలో ఖిలాడి మూవీని నిర్మాతలే ఓన్ గా రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ ఇప్పుడు మంచి టార్గెట్ తోనే బరిలోకి దిగింది . ఒకసారి మూవీ ఏరియాల వారి బిజినెస్ ను గమనిస్తే..

నైజాం8 cr
సీడెడ్3.50 cr
ఏపీ10 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)21.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా2.10 cr
ఓవర్సీస్1.20 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)24.80 cr

ఖిలాడి మూవీ సొంతం చేసుకున్న టోటల్ బిజినెస్ లెక్క. ఇక మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే 25.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఖిలాడి మూవీ క్లీన్ హిట్ అవుతుంది.

Khiladi Movie Day Wise Total Collections :

ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ షేర్ మొత్తం మీద 3.8 కోట్లు మాత్రమే సొంతం అయ్యింది. ఇక ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ వర్షన్ కలెక్షన్స్ ఇంకా అప్ డేట్ అవ్వాల్సి ఉండగా అవి కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా

ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 4.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా అందులో షేర్ 3.80 కోట్ల దాకా వచ్చింది. ఇక రెండో రోజు కి వచ్చే సరికి ఖిలాడి మూవీకి పోటిగా డిజే టిల్లు మూవీ ఉండటంతో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉండగా 2.2 కోట్ల నుండి 2.4 కోట్ల మధ్యలో మూవీ షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేసినా కానీ మూవీ మొత్తం మీద రెండో రోజు 1.95 కోట్ల రేంజ్ షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఖిలాడి మూవీ (Khiladi Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు నుండి కొత్త సినిమాల ఎఫెక్ట్ వలన స్లో అవ్వక తప్పలేదు. మూవీకి డిజే టిల్లు నుండి పోటి ఎదురు అవ్వగా ఆ మూవీ యూత్ ని బాగా అట్రాక్ట్ చేయడం మాస్ ని కూడా మెప్పించేలా ఉండటం లాంటివి ఖిలాడి మూవీ పై ఇంపాక్ట్ చూపి రెండో రోజు నుండి డ్రాప్స్ మొదలు అవ్వగా మూడో రోజు మూవీ 1.5 కోట్ల షేర్ ని అందుకుంటుంది అనుకోగా ఆ మార్క్ ని అయితే అందుకున్న మూవీ 1.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.

Khiladi Movie Total Collections

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 4 వ రోజు వాలంటైన్స్ డే అడ్వాంటేజ్ వలన ఉన్నంతలో మంచి వసూళ్ళతో హోల్డ్ చేసింది అని చెప్పాలి. ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 75 లక్షల నుండి 80 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా ఖిలాడి మూవీ మొత్తం మీద 87 లక్షలతో ముగించింది అని చెప్పాలి.

ఖిలాడి మూవీ ఉన్నంతలో మంచి వసూళ్ళ తోనే పరుగును కొనసాగిస్తూ వెళుతూ ఉండగా మూవీ 4 వ రోజు వాలంటైన్స్ డే రోజున పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసు కోగా మూవీ 5 వ రోజు ఫుల్ వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన కలెక్షన్స్ స్లో డౌన్ అయినట్లు అనిపించినా కానీ మూవీ ఉన్నంతలో మంచి వసూళ్ళని సాధించి అనుకున్న అంచనాలను కూడా మించి పోయే వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంటుంది అనుకున్నా మూవీ 60 లక్షల మార్క్ ని కూడా దాటేది 70 లక్షల మార్క్ ని అందుకుని 72 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు 72 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న ఖిలాడి మూవీ ఇప్పుడు 6 వ రోజు కి వచ్చే సరికి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా మూవీ 56 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది.

ఖిలాడి మూవీ 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సగం టార్గెట్ ను ఓవరాల్ గా రికవరీ చేసింది అని చెప్పాలి. ఖిలాడి మూవీ 23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మూవీ ఇప్పుడు 11.74 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Related posts

Dhamaka Trailer: ధమాకా ట్రైలర్.. ఎగ్జాంపుల్ సెట్ చేశానంటోన్న రవితేజ!

Hardworkneverfail

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Hardworkneverfail

Unstoppable with NBK : అన్‏స్టాపబుల్ షోలో రవితేజ, గోపిచంద్ మలినేని సందడి..

Hardworkneverfail

Khiladi Movie 8 Days Collection : మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు తెప్పించిందా..!

Hardworkneverfail

Ravanasura: రవితేజ రాముడా? రావణాసురుడా?

Hardworkneverfail