ఆంధ్రప్రదేశ్ : కుప్పం మున్సిపాలటీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి… వైసీపీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విజయం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా వైసీపీ గెలవడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ఏ ఎన్నికలు వచ్చిన వార్ వన్ సైడేనని… నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు.
కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును…హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని… కుప్పం ప్రజలు సీఎం జగన్ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు …. కుప్పం మున్సిపాలటీ ఎన్నికల్లో బొక్క బోర్ల పడ్డారని చురకలు అంటించారు. తండ్రి, కొడుకులు తట్ట బుట్టా సద్దుకుని హైదరాబాదు పోవాలన్నారు. వైసీపీ పార్టీని గెలిపించిన కుప్పం ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రోజా.