Bright Telangana
Image default

Bangarraju: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ

Laddunda Song Teaser - Bangarraju

కింగ్‌ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే! ఈ మూవీకి ప్రీక్వెల్‌ అయిన బంగార్రాజుతో హిట్‌ కొట్టడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున. ఇందులో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ‘బంగార్రాజు’ మూవీలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్‌ చేశారు ఈ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ.

తాజాగా ఈ మూవీ నుంచి లడ్డుందా సాంగ్‌ టీజర్‌ రిలీజైంది.’ బాబూ తబలా, అబ్బాయి హార్మోనీ.. తానన ననన.. డాంటకు డడనా..’ అంటూ ఏదో రాగం అందుకున్నాడు. ఇదర్థం కాక ఓ వ్యక్తి రాజుగారు దీని మీనింగ్‌ ఏంటని అడిగాడు. దీనికి బంగార్రాజు ఎప్పటిలాగే ఓ నవ్వు విసిరేస్తూ.. ‘ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? అడగాలి కదా! నేర్పిస్తాను కదా!’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి పాటని ఈ నెల 9న(మంగళవారం) విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఉదయం 9.09గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. కాగా టీజర్‌ చూస్తుంటే నాగార్జున స్వర్గంలోని దేవకన్యలతో డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

Related posts

Kamal Haasan: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

Hardworkneverfail

Akhanda Pre Release Event live : బాలకృష్ణ అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

అల్లర్లతో ‘మా’ పరువు తీయవద్దు: చిరంజీవి

Hardworkneverfail