కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించినా ఈ మూవీని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మించారు. ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘రాజా విక్రమార్క’ యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెల అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని మూవీల మీద కూడా గట్టిగానే ఉందని చెప్పాలి. ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇంకా బెటర్ గా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
ఫస్ట్ డే | 0.74 cr |
సెకండ్ డే | 0.55 cr |
థర్డ్ డే | 0.45 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 1.74 cr |
రాజా విక్రమార్క మూవీ రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి రూ.1.74 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. వర్కింగ్ డేస్ లో బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. పోటీగా మరో రెండు మూవీలు కూడా ఉండడం ఈ మూవీ కల్లెక్షన్లకి బ్రేకులు పడినట్టు అయ్యింది.