Ram Gopal Varma Shocking Comments On Kodali Nani : మూవీ టిక్కెట్ల ధరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ పలు ప్రశ్నలు సంధించారు. మూవీ టిక్కెట్ల ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మూవీకి, సంపూర్ణేష్ బాబు మూవీకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అని ఎద్దేవా చేశారు.
మరోవైపు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… ‘ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే అని వాళ్లు చెపుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’ అని ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై కొడాలి నాని ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.