Bright Telangana
Image default

AP Cinema Tickets Issue : ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు.. రామ్ గోపాల్ వర్మ

AP Cinema Tickets Issue

RGV on AP Cinema Tickets Issue : మూవీ ఇండస్ట్రీ పరంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కోవిడ్ మహమ్మారికి పెద్దగా తేడా లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ రెండూ మూవీ ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం తగ్గిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి‌ స్పెషల్ ఎడిషన్ లో మాట్లాడుతూ.. మూవీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వ వ్యవహార తీరును తప్పుపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు మరియు టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా.. తెలుగు మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదన్నారు. అయినా వారు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు వర్మ. ఇండస్ట్రీ పెద్దలంటే.. అంతా బాగా సెటిల్ అయినవారు. అలాంటి అప్పుడు వారు ప్రభుత్వంతో గొడవపడాలని ఎందుకు అనుకుంటారు? అందుకే వారంతా సైలెంట్ గా ఉంటున్నారని అన్నారు.

హీరోల రెమ్యూనరేషన్‌పై ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలని ఆయన కొట్టిపారేశారు. ఎందుకంటే నిర్మాత ఎంత పెట్టి మూవీ నిర్మించాడనేది ఎవరూ చూడరు.. పలానా హీరో అని మాత్రమే ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని, హీరో అనేవాడు బ్రాండ్ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలపై రామ్ గోపాల్ వర్మ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Related posts

Ram Gopal Varma : ఏపీ టికెట్ల ధరలపై ప్రభుత్వంతో వర్మ చర్చలు

Hardworkneverfail

Ram Gopal Varma : ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్.. కట్టప్పను ఎవరు చంపారు ?

Hardworkneverfail

Kodali Nani : రామ్ గోపాల్ వర్మకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..

Hardworkneverfail

Minister Botsa Satyanarayana : నానికి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్..

Hardworkneverfail

Tax on Garbage in AP : అనవసరంగా గెలిపించాం… చెత్తపై పన్నా ?

Hardworkneverfail

Actor Suman : ఏపీలో మూవీ టిక్కెట్ల సమస్యపై సుమన్ ఘాటు వ్యాఖ్యలు..

Hardworkneverfail