Bright Telangana
Image default

షాకింగ్: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న సమంత..!

Samantha is suffering from a life threatening disease

Samantha is suffering from a life threatening disease : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు షాకింగ్ విషయాన్నీ తెలిపింది. తాను మయోసిటిస్‌ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఒక్కసారిగా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పి. వారిని షాక్ కు గురి చేసింది. మయోసిటిస్‌ వ్యాధి లక్షణాలతో బాధపడేవారు ఎక్కువ సేపు నడవలేరు.. అలానే నిల్చోలేరు. కండరాలు బలహీనంగా మారుతుంటాయి. అలానే అతిగా నీరసం కూడా వస్తుంటుంది. అలాంటి ఈ వ్యాధి తనకు వచ్చిందని.. చాలా రోజుల నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఈ విషయం ఎప్పుడో చెప్పాలని భావించిందట. కానీ ప్రతీది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పలేదట. లైఫ్‌లో ఎదురయ్యే ఛాలెంజ్‌లని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే అని సమంత చెప్పుకొచ్చింది. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఇటీవల భరించలేని కష్టాలు వచ్చాయని గుర్తు చేసుకున్న సమంత.. అవి గడిచిపోయినవిగా చెప్పుకొచ్చింది. ఈ మయోసిటిస్‌ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్నీ చెప్పిన దగ్గరి నుండి సోషల్ మీడియా లో అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

ప్రస్తుతానికి మైయోసిటిస్ కు చికిత్స లేదని తెలుస్తోంది. అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి.. కండరాలను బలహీతను పురోగతి చెందకుండా నిరోధించడానికి చికిత్స చేస్తుంటారు. ఫిజికల్ థెరపీ హీట్ థెరపీ వ్యాయామంతో కూడా ఉపశమనం పొందవచ్చని తెలుస్తోంది. ఈ వ్యాధితో ఒక్కోసారి అంగవైకల్యం వచ్చి.. పరిస్థితి చేయిదాటితే ఏమైనా సంభవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నడిచిన యశోద మూవీ నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా ఈ మూవీ తాలూకా ట్రైలర్ విడుదలై ఆసక్తి పెంచింది. సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో సమంత గర్భవతిగా కనిపిస్తోంది.

Related posts

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Samantha Special Song : సమంత స్పెషల్ సాంగ్ .. ఊ అంటావా ఊ ఊ అంటావా లిరికల్ వీడియో

Hardworkneverfail

Samantha: యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత…పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

Hardworkneverfail

Samantha: సమంతకు ఊరట.. ఆ వీడియోలు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

Hardworkneverfail

Shakuntalam Trailer: అవమానాన్ని ఏ ప్రేమ మరిపించలేదు.. ‘శాకుంతలం’ ట్రైలర్

Hardworkneverfail