Samantha Special Song in Pushpa Movie : డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ కాంబినేషన్ లో త్వరలో వస్తున్నా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేయడంతో బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఇక సుకుమార్ మూవీలో ఐటెం సాంగ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. మరి ‘పుష్ప’ మూవీలో సమంతను ఎంత హాట్ గా చుపించారో.. ఏ రేంజ్ లో స్టెప్స్ వేయించారో అని అంత ఎదురుచూస్తున్న క్రమంలో సమంత ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే లిరికల్ వీడియోను మూవీ యూనిట్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను మగాళ్ళ మెంటాలిటీని తెలియచేస్తూ చంద్రబోస్ అద్భుతంగా రాశారు.
ఇంద్రావతి చౌహాన్ మాస్ వాయిస్‌తో పాడించారు. ఇటీవల విడుదల చేసిన ‘పుష్ప’ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 12న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీని మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.