బిగ్‌బాస్ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే తెలుగు, హిందీతోపాటు.. తమిళం.. కన్నడం.. మలయాళం భాషలలోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో దూసుకుపోతుంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతుండడంతో హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ 5 టైటిల్ ఎవరికి దక్కుతుందో అనే ఆసక్తి నెలకొంది. రవి, మానస్, శ్రీరామ్, సన్నీ లాంటి బలమైన కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ పోటీ ఉన్నట్లు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది.
ఇక తాజాగా.. తెలుగు బిగ్‌బాస్ షో పై.. స్పందించాడు సోనూసూద్. దేశవ్యాప్తంగా సోనూసూద్‌కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. అయితే ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్.. తెలుగు బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు.. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. అయితే సోనూసూద్ ఇలా బిగ్‌బాస్ షోపై స్పందించడంతో అభిమానులు ఒకవైపు ఆశ్చర్యంగానూ.. మరోవైపు సంతోషం వ్యకం చేస్తున్నారు.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రను చూస్తున్నారా ? నేను చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.