సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన తమిళ మోషన్ పోస్టర్ – టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని మేకర్స్ ఆవిష్కరించారు. తెలుగులో ఈ మూవీ హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో రజినీకాంత్ మూవీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఈ మూవీ లో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విషయానికొస్తే.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు. ఇక ’పెద్దన్న’గా రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వస్తోన్న రజినీకాంత్ లుక్ మాసీగా ఉంది. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.