Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని ఆహ్వానించారు. తాజాగా ఎపిపోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తాజా ప్రోమోలో, రాజమౌళి మరియు ఎంఎం కీరవాణి ఇద్దరూ షో హోస్ట్ అయిన ‘అఖండ’ హీరో బాలకృష్ణతో చాట్ చేయడం చూడవచ్చు. ఈ ముగ్గురూ షోలో ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకుంటూ గొప్ప సమయాన్ని పంచుకున్నారు మరియు ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌ని చూడటానికి ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ షోలో ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చేసి సందడి చేశారు.