థియేటర్లలో విడుదల అయిన సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో వాటికి ఓటీటీ లో మంచి డిమాండ్ ఉంటుంది. కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లని వారు ఓటీటీ లో కాస్త ఆలస్యంగా అయినా సినిమాలను చూడాలని ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదల అయిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా కూడా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. అయినా కూడా ఇంకా చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా లవ్ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో లవ్ స్టోరీని ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 24న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ను నాలుగు వారాల తర్వాత ఆహా లో స్ట్రీమింగ్ కు ఉంచబోతున్నారు. అంటే అక్టోబర్ 22న ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దసరా తర్వాత ఆహా లో రాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి ఆహా వారు ప్రకటించారు. దసరా నుండి సంక్రాంతి వరకు తమ ఆహా లో అద్బుతమైన కంటెంట్ రాబోతున్నట్లుగా ప్రకటించిన టీమ్ ఆహా లవ్ స్టోరీ సినిమాను దసరా తర్వాత విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన లవ్ స్టోరీ సినిమాను ప్రేక్షకులు థియేటర్ల ద్వారా ఆధరించారు. అలాగే మ్యూజికల్ గా కూడా సక్సెస్ ను దక్కించుకున్న లవ్ స్టోరీ మళ్లీ ఓటీటీ లో సక్సెస్ అయ్యేనో చూడాలి.