‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించారు. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. 88 రామారెడ్డి నిర్మాత. నవంబర్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎన్.ఐ.ఎ ఏజెంట్ విక్రమ్ పాత్రలో కార్తికేయ నటించిన చిత్రమిది. ఆయన లుక్, పాత్రతోపాటు కథనం కొత్తగా ఉంటుంది. స్క్రిప్ట్‌కి అనుగుణంగా ఎక్కువ లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఈ సినిమా కోసం ఉపయోగించే వాహనాలు, గన్స్ దగ్గర్నుంచి ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం’’ అన్నారు.
శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు’’ అన్నారు. తొలి కాపీ సిద్ధమైంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, సమర్పణ: ఆదిరెడ్డి.టి.