నాగ చైతన్యతో విడాకుల అనంతరం.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్(సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌నను పాస్ చేసింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో.. సమంతకు సైతం న్యాయస్థానం కీలక సూచన చేసింది. తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని చెప్పింది.
రెండు యూట్యూబ్ ఛానళ్లు.. తమ లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎవరూ కూడా సమంతకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ప్రసారం చేయవద్దని చెప్పింది. కోర్టు ఆదేశించిన ప్రకారంగా ఆ యూట్యూబ్ చానళ్లు చర్యలు స్పందించాల్సిందే అని సమంత తరఫు న్యాయవాది తెలిపారు.
కోర్టు తీర్పు చేతికి వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఆమె తరఫు లాయర్ తెలిపారు. సమంతపై వచ్చిన వార్తల లింక్స్ కూడా ఎప్పటిలోగా తొలగించాలన్నదీ.. తీర్పు ప్రతులు చేతికి అందాకే చెప్పగలమని అన్నారు.