బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలకృష్ణ చేస్తోన్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ప్రోమో తాజాగా రిలీజైంది. స్టైలిష్ లుక్లో.. పంచ్ డైలాగ్లు చెబుతూ బాలయ్య అదరగొట్టారు. స్పోర్ట్స్ కారు, స్పోర్ట్స్ బైక్ నడపడం సహా గుర్రపు స్వారి చేస్తూ బాలయ్య కనిపించారు. మరెందుకు ఆలస్యం త్వరగా ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.