తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి మూవీలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. గతంలో వీళ్లిద్దరు ‘అవన్ ఇవన్’ (వాడు వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసారు. ఇపుడు మళ్లొసారి వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతున్న ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగింది..
‘ఎనిమి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్...
నైజాం | 2.00 cr |
ఆంధ్రా(మొత్తం) | 0.95 cr |
సీడెడ్ | 0.85 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 3.80 cr |
ఎనిమి’ మూవీ రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినా దానిని రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి ప్రజెంట్ అయితే తెలుగు లో పెద్దగా బజ్ ఏమి లేదనే చెప్పాలి కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ ని రికవరీ చేస్తుందో చూడాలి.