విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త మూవీ ‘పుష్పక విమానం’ యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని మూవీల మీద ఉన్నట్లు గానే ఈ మూవీ మీద కూడా కనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీకి మరీ అంచనాలను మించి గ్రోత్ ఏమి కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయ్యింది ఈ మూవీ.
‘పుష్పక విమానం’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
నైజాం | 0.48 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
సీడెడ్ | 0.25 cr |
ఈస్ట్ | 0.10 cr |
వెస్ట్ | 0.07 cr |
గుంటూరు | 0.11 cr |
నెల్లూరు | 0.08 cr |
కృష్ణా | 0.09 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 1.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.34 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 1.74 cr |
‘పుష్పక విమానం’ మూవీ రూ.2.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఈ మూవీ రూ.2.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ. 1.74 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.0.56 కోట్ల నష్టం వాటిలింది.