సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదలయ్యింది. ఈ మూవీకి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది, కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి.
‘పెద్దన్న’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 0.52 cr |
ఉత్తరాంధ్ర | 0.16 cr |
సీడెడ్ | 0.25 cr |
ఈస్ట్ | 0.12 cr |
వెస్ట్ | 0.9 cr |
గుంటూరు | 0.25 cr |
నెల్లూరు | 0.10 cr |
కృష్ణా | 0.12 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 1.61 cr |
‘పెద్దన్న’ మూవీకి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ 12.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ మూవీ కేవలం రూ.1.61 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.