తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శివ కార్తికేయన్. గత కొంతకాలంగా ఆయన నటించిన మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఆయన కీలక పాత్రలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న ఏక కాలంలో విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ మౌత్ టాక్ పైనే ఆధారపడి తర్వాత పుంజుకుంది.
‘వరుణ్ డాక్టర్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ :
నైజాం | 0.65 cr |
ఉత్తరాంధ్ర | 0.35 cr |
సీడెడ్ | 0.38 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.18 cr |
గుంటూరు | 0.27 cr |
నెల్లూరు | 0.16 cr |
కృష్ణా | 0.24 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 2.46 cr |
‘వరుణ్ డాక్టర్’ మూవీకి తెలుగులో రూ.1.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.1.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆ టార్గెట్ ను మొదటి వారమే ఫినిష్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.2.46 కోట్ల షేర్ ను రాబట్టింది…దీంతో బయ్యర్లకు రూ.1.21 కోట్ల వరకు లాభాలను అందించింది.