కమల్ హాసన్ బర్త్ డే కానుక వచ్చింది. అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. తాను నటిస్తున్న విక్రమ్
మూవీ నుంచి ఫస్ట్ గ్లాన్స్ విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. 48 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు దుమ్మురేపుతుంది. ఓ జైల్లో నుంచి తప్పించుకుంటున్న క్రమంలో పోలీసులు వెంటపడుతుంటారు. కాల్పులు జరుపుతుంటారు. పోలీస్ రక్షణ కవచాలను అడ్డుపెట్టుకుని ఒక్కసారిగా ఓపెన్ చేసి తనదైన యాక్షన్ లుక్తో కమల్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది.
ఖైది, మాస్టర్ వంటి సూపర్ డూపర్ హిట్ మూవీలతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించిన లోకేశ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. అంతేకాకుండా దాదాపు మూడేళ్ల అనంతరం కమల్ హాసన్ చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై హైప్ నెలకొంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు మళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.