విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త మూవీ ‘పుష్పక విమానం’ నిన్న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని మూవీల మీద ఉన్నట్లు గానే ఈ మూవీ మీద కూడా కనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీకి మరీ అంచనాలను మించి గ్రోత్ ఏమి కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయ్యింది ఈ మూవీ.
‘పుష్పక విమానం’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
నైజాం | 0.12 cr |
ఆంధ్రా(మొత్తం) | 0.20 cr |
సీడెడ్ | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 0.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.20 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 0.56 cr |
‘పుష్పక విమానం’ మూవీ రూ.2.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఈ మూవీ రూ.2.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫస్ట్ డే ఈ మూవీ రూ.0.56 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా బుకింగ్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. వీకెండ్ బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. పోటీగా మరో రెండు మూవీలు కూడా ఉండడం ఈ మూవీ కల్లెక్షన్లకి బ్రేకులు పడినట్టు అయ్యింది.