బాలకృష్ణ ఓటీటీ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి రోజు నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవుతూ.. విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక మొదటి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేశారు బాలకృష్ణ.
బాలకృష్ణ చేస్తోన్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. ఇందులో నటుడు నాని సోషల్ మీడియా గురించి బాలకృష్ణను అడిగారు. అందుకు బాలకృష్ణ స్పందిస్తూ.. అర్జునుడి బాణం లాగా తన పని తాను చేసుకుంటూ పోవడమే బాలయ్య సిద్దాంతం అని చెప్పాడు. ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK యొక్క తాజా ఎపిసోడ్‌ని చూసి ఆనందించండి.