అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయ్యింది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ రన్ ముగిసేసరికి 4.77 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీనీ ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు ఆహా యాజమాన్యం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీనీ నవంబర్ 19న ఆహాలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీనీ ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదల చేస్తుండడం విశేషం. మరి బిగ్ స్క్రీన్‌పై వండర్స్ క్రియేట్ చేసి అఖిల్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ మూవీనీ ఓటీటీలో ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో చూడాలి.
Here's to all eligible bachelors out there!
— ahavideoIN (@ahavideoIN) November 14, 2021
Can't keep the waiting game on anymore.
The ever charming "Most Eligible Bachelor " is all set to hit your home screens on 19th of this month.#MEBonAHA#MostEligibleBachelor #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz pic.twitter.com/1KCRra7YCl