ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. దాక్కొ.. దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా.. ఇక ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు మూవీ యూనిట్. డిసెంబర్ 6వ తేదీన మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
పుష్ప మూవీ లో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ మూవీలో ఐటెం సాంగ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ మూవీలో సమంతను ఎంత హాట్ గా చుపించారో..ఏ రేంజ్ లో స్టెప్స్ వేయించారో అని అంత ఎదురుచూస్తున్న క్రమంలో సమంత సిజ్లింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్. త్వరలో ఈ ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ ని చూడటానికి సిద్ధంగా ఉండండని మూవీ యూనిట్ ట్వీట్ చేసి సమంత పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ప్రత్యేకంగా వేసిన సెట్లో ఆ పాటకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతూ ఉండగానే, అందుకు సంబంధించిన సమంత స్టిల్ కూడా బయటికి వచ్చింది. ఇక ఈ పాట లిరికల్ వీడియోను త్వరలో వదలనున్నారు. ఫస్టు పార్టులోనే ఈ పాట ఉండడం అభిమానులను ఖుషీ చేసే విషయం.
A Rocking Number with Icon Star @alluarjun & @Samanthaprabhu2 being shot in a gigantic set 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 30, 2021
Get ready to witness the 'Sizzling Song of The Year' soon 💥#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic pic.twitter.com/5nMSHhmvRs