Pushpa Movie Review : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్, తెలుగు రాష్టాలతో సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. ఇప్పటికే ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప మూవీ గురించే చర్చ జరుగుతంది. ఇక హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ మూవీను ప్రమోషన్‌ను చేసారు మేకర్స్ .
‘పుష్ప’ మూవీ అయిదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, నాలుగు భాషల్లోనే విడుదల చేశారు. అల్లు అర్జున్ కు భారీగా క్రేజ్ ఉన్న కేరళలో ఈ మూవీ మలయాళ వెర్షన్ ను అనుకున్న సమయంలో వాళ్ళ ముందుకు తీసుకురాలేకపోయారు. సిస్టమ్‌లోని బగ్ కారణంగా సింక్ సమస్యలు, ఇతర ఆడియో గ్లిచ్‌లు రావడంతో మలయాళం రిలీజ్ ఆలస్యం అయ్యింది అంటూ మూవీ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టీ వెల్లడించారు. అందువలన ముందుగా ప్రకటించినట్టుగా ఈరోజు (డిసెంబర్ 17న) మూవీ విడుదల కాలేదు. కానీ వారిని ఎక్కువ నిరాశ పరచకుండా డిసెంబర్ 18నే ‘పుష్ప’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.
ట్రైలర్ తో మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.