Bigg Boss 5 Finals : బిగ్బాస్ తెలుగు సీజన్ 5 ఈరోజుతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం బిగ్బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. అయితే బిగ్బాస్ మేకర్స్ ఈసారి గత సీజన్లకు భిన్నంగా సీజన్ 5 ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్బాస్ 5 గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్, రాజమౌళి, సుకుమార్, సాయి పల్లవి, రణవీర్ సింగ్, అలియా భట్ బిగ్బాస్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సందడి చేయనున్నట్లుగా సమాచారం.
అలాగే టాప్ సెలబ్రెటీస్తో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లుగా మరో టాక్. అయితే ముందు నుంచి విన్నర్ ఎవరనే దాని పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎవరు విన్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలిసిందే మరి.