Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu: తమ కష్టాలు గుర్తుకు చేసుకున్న కంటెస్టెంట్స్‌

bigg boss 5 latest promo

బిగ్‌బాస్‌ ఇంటిలో ఉన్న సభ్యులందరూ తమ జీవితాల్లో చోటు చేసుకున్న చేదు అనుభవాలను పంచుకోవాలని సూచించాడు. దీంతో వాళ్లందరూ తమ జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను షేర్‌ చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో భాగంగా సన్నీ మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు అబ్బాయిలను ఓ మహిళ పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు’’ అని తన లైఫ్‌ జర్నీని అందరితో పంచుకున్నాడు. అనంతరం జెస్సీ.. ‘‘పుట్టినప్పటి నుంచి నాకు గొంతులో సమస్య ఉంది. దానివల్ల నాకు సరిగ్గా వాయిస్‌ రాదు. గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకున్నాను. ఫ్యాషన్‌బుల్‌ ఐకాన్‌ అయ్యాను. కానీ మా అమ్మ బయటకు వెళ్లి మా అబ్బాయి మోడల్‌ అని చెప్పుకోలేదు’’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

ఇక, సిరి కథ విని ఇంటి సభ్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మా ఊరిలో వాళ్లు, బంధువులు నన్ను, నా ఫ్యామిలీని సూటిపోటి మాటలతో బాధపెట్టారు. ‘ఇంట్లో పెద్దవాళ్లు ఏమైనా పద్ధతిగా ఉన్నారా? ఈ పిల్ల పద్ధతిగా ఉండటానికి’ అనేవాళ్లు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే నేను పద్ధతిగానే పెరిగాను. పద్ధతిగానే ఉంటున్నాను’’ అని సిరి చెప్పడంతో కంటెస్టెంట్స్ అందరూ ఒకింత ఎమోషనల్‌ అయ్యారు. మిగిలిన ఇంటి సభ్యులు పంచుకున్న రియల్‌ లైఫ్‌ స్టోరీలు ఏమిటో తెలియాలంటే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోలు చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

LIVE – Bigg Boss 5 Finals : బిగ్‌ ఫైనల్స్‌.. గెలిచేది ఎవరు?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు..సన్నీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : నాగార్జున సపోర్ట్‌తో షణ్ముఖ్‌పై రివెంజ్‌ తీర్చుకున్న రవి..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా సన్నీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : ష‌ణ్ముఖ్‌..దీప్తి కావాలనుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపో..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : ఈ వారం ఇంటినుండి బయటికి పంపేది ఎవరిని?

Hardworkneverfail