Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి ఆహాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి షోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య సాగే సంభాషణ ఆకట్టుకుంటోంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్’ షోలో మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే బాలకృష్ణ, రవితేజల గత కొన్నేళ్లుగా మధ్య విభేదాలు ఉన్నాయని చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరదించుతూ బాలకృష్ణ.. మాస్ మహారాజ్ రవితేజకు హోస్ట్‌గా వ్యవహరించారు. ‘అన్‌స్టాపబుల్’ షో ‘ఆహా’లో ఈ ఎపిసోడ్ చూడాలంటే మరో వారం ఆగాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
#UnstoppableWithNBK is getting a MASS makeover. 🔥🔥
— ahavideoIN (@ahavideoIN) December 19, 2021
The God of Masses #NandamuriBalakrishna is joined by our Mass Maharaja @RaviTeja_offl and director @megopichand.
Let's get KRACKed.
Episode 6 premieres Decemeber 24. pic.twitter.com/FVfMPl9oQb