Vaasivaadi Tassadiyya Song From Bangarraju Movie : భారీ అంచనాలున్న మూవీస్ లో అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ మూవీ ఒకటి. నాగార్జున మరియు నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’ మూవీ నుండి పూర్తి లిరికల్ సాంగ్ వాసివాడి తస్సదియాను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో నటుడు ఫరియా అబ్దుల్లాతో కలిసి నాగార్జున మరియు నాగ చైతన్య స్టెప్పులు బాగున్నాయి.
ఈ పాటకు సాహిత్యం కళ్యాణ్ కృష్ణ కురసాల అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ పాటను మోహన బోగరాజు మరియు సాహితి పాడారు. ఈ మూవీ 2016లో సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి ప్రీక్వెల్. ఇందులో నాగార్జున మరియు రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.