Bangarraju Movie Update : అక్కినేని నాగార్జునకి మొదటి నుంచి ముందుచూపు ఎక్కువే. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో నాగార్జున చాలా తెగింపు చూపిస్తారు. ‘బంగార్రాజు’ మూవీ విషయంలోను ఆయన అదే విధంగా వ్యవహరించారు. ఈ మూవీ కథ విషయంలో నాగార్జునను.. కల్యాణ్ కృష్ణ మెప్పించడానికీ.. ఆ తరువాత కొన్ని కారణాల వలన ‘బంగార్రాజు’ మూవీ సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పట్టింది. ఇక సెట్స్ పైకి వచ్చిన తరువాత మాత్రం నాగార్జున ఆలస్యం చేయలేదు.
‘బంగార్రాజు’ మూవీ గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కనెక్ట్ అయ్యే కథ. అందువలన ఆయన ఎలాగైనా ‘బంగార్రాజు’ మూవీని సంక్రాంతి బరిలో దింపాలని బలంగా నిర్ణయించుకున్నారు నాగార్జున. అందువల్లనే ఒక వైపున షూటింగు జరుగుతూ ఉండగానే, వెంట వెంటనే టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ వదులుతూ వచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మూవీస్ కరోనా కారణంగా బరి నుంచి తప్పుకున్నాయి. అదృష్టవంతుడికి అడ్డంకులు ఉండవు అన్నట్టుగా సంక్రాంతి సందర్బంగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘బంగార్రాజు’ రెడీ అయ్యాడు. రమ్యకృష్ణకి ఎంత ఫాలోయింగ్ ఉందో.. కృతిశెట్టికి అంతటి క్రేజ్ యూత్ లో ఉండటం ఈ మూవీకి మరింతగా కలిసొచ్చే అంశం. అప్పటి వరకూ కరోనా తీవ్రత పెరగకపోతే, టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంతటి అదృష్టవంతుడు ఉండడనే చెప్పాలి. Bangarraju movie update