Bangarraju Trailer : మూవీ యూనిట్ ‘బంగార్రాజు’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్యలు ఒకే ఫ్రేమ్ లో తళుక్కున మెరిశారు. బంగార్రాజుగా కింగ్ నాగార్జున మీసం మెలేస్తే.. తన సత్తా చూపించేందుకు నాగచైతన్య సిద్ధమయ్యాడు.
రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నాగార్జున, నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. ప్రత్యేక గీతంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది.
కల్యాణ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ రూపొందుతోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చాడు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.