Eyy Bidda Idhi Naa Adda Full Video Song : ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’.. రష్మిక కాంబినేషన్లో.. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన ‘పుష్ప’ మూవీ క్రితం నెలలో 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన రోజు నుండి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు దుమ్ము దులిపింది.
ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. అల్లు అర్జున్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ (Eyy Bidda Idhi Naa Adda) సాంగ్ కి థియేటర్లో మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం .. నకాష్ అజీజ్ ఆలాపన ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఈ మూవీ నుంచి పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసారు మేకర్స్.